సాగర్ కాలువలో యువకుని శవం లభ్యం..

by Vinod kumar |
సాగర్ కాలువలో యువకుని శవం లభ్యం..
X

దిశ, పెన్ పహాడ్: సాగర్ కాలువలో యువకుని శవం లభ్యమైన ఘటన అన్నారం బ్రిడ్జి గ్రామం వద్ద నాగార్జునసాగర్ కాలువలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మృతుడు మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఆవుల దొడ్డి అజయ్ కుమార్ (25)గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం స్నేహితులతో హోలీ పండుగ జరుపుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో చిల్లాపురం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువలో స్నానం కోసం వెళ్లగా.. ప్రమాదవశాత్తు కాలుజారి సాగర్ కాలువలో పడడంతో వరద తాకిడి వేగంగా ఉండటంతో ఆ తాకిడికి కొట్టుకొని మృతి చెందాడు. ఈ క్రమంలో అన్నారం బ్రిడ్జి వద్ద శవం లభ్యమైనట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి శవాన్ని బంధువుల అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed