- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్ సమావేశం నుండి బీజేపీ కౌన్సిలర్ల వాకౌట్...
దిశ, చౌటుప్పల్ : చౌటుప్పల్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం నుండి బీజేపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ బడ్జెట్ సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ కౌన్సిలర్లు ఏడుగురు హాజరు అయ్యారు. అనంతరం సమావేశం నుండి వాక్ అవుట్ చేసిన కౌన్సిలర్లు మాట్లాడుతూ సమావేశంలో తాము ప్రజాసమస్యలను లేవనెత్తామని, కానీ ఈ బడ్జెట్ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు, చైర్మన్ కి వ్యక్తిగత లాభం కోసం మాత్రమేనని ఆరోపించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎక్కడ కూడా ఉపయోగపడటంలేదని అన్నారు. గతంలో వార్డుల వారిగా లక్షల రూపాయల నిధులు వెచ్చించానని చైర్మన్ చెప్పారని వాటిని రుజువు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. వీటిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన కరువైందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ ను తాము వ్యతిరేకిస్తున్నామని అందుకే సమావేశం నుంచి వాకౌట్ చేశామని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశంలో 2013-14 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల 66 లక్షల రూపాయల అంచనాను ఆమోదించారు. వాక్ అవుట్ చేసిన వారిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్లు కొయ్యడ సైదులు, ఉబ్బు వరమ్మ వెంకటయ్య, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, అంతటి విజయలక్ష్మి బాలరాజు, సందగళ్ళ విజయ సతీష్, కామిశెట్టి శైలజ భాస్కర్లు ఉన్నారు.