- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్‌దే అధికారం'
దిశ, సంస్థాన్ నారాయణపురం: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనిరాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో డేరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమ భరత్, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి అందాయని అన్నారు. రైతుబంధు,రైతు బీమా, మిషన్ భగీరథ,కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి బీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగానే కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించామని అన్నారు.
ఈ కార్యక్రమం ప్రారంభంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేవని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలు ఇక్కడ ఖర్చు పెడుతున్నారని అన్నారు. పార్టీ పటిష్టత కోసం కృషి చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి వెంకటేశం, పిఎసిఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి బొల్ల శివశంకర్, మండల పార్టీ అధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, సర్పంచ్‌లు సామ బాస్కర్,సుర్వి యాదయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.