- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడిపందాల స్థావరంపై దాడులు..పోలీసులు ఏమన్నారంటే..?
దిశ, నేరేడుచర్ల : బెట్టింగ్ పెట్టి కోడిపందాలు ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి కోడిపుంజులు, నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు నేరేడుచర్ల ఎస్సై రవీందర్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలంలోని పత్తేపురం గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం బెట్టింగ్ పెట్టి కోడి పందాలు ఆడుతున్నారని సమాచారం రావడంతో..ఆ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు రైడ్ చేసినట్లు తెలిపారు. అక్కడ బెట్టింగ్ పెట్టి కోడిపందాలు ఆడుతున్న ఐదు వ్యక్తులను గుర్తించినట్టు తెలిపారు. అందులో సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణానికి చెందిన రెడ్డిపల్లి రాంప్రసాద్ , పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని వాడపల్లికి చెందిన మంతెన విజయ వెంకట నరసింహారాజు , సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామానికి చెందిన సల్వాడి రాజేష్ కుమార్ అలాగే..నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ముత్తిరెడ్డి కుంటకు చెందిన ఓరుగంటి నరేష్ లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు . సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందుల వారి గూడెం గ్రామానికి చెందిన దేవులపల్లి నాగయ్య చారి(నరసింహ చారి) పరారీలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు .