రాష్ట్ర సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి

by Naresh |
రాష్ట్ర సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి
X

దిశ, కోదాడ: పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ సిబ్బంది పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలి అని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎన్టీఆర్ జిల్లా డీసీపీ శ్రీనివాసరావులు అన్నారు. శుక్రవారం తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రామాపురం క్రాస్ రోడ్, గరికపాడు చెక్ పోస్టులను తనిఖీలు చేసి వారు మాట్లాడారు. నగదు, మద్యం తరలింపు అసాంఘిక కార్యకలాపాల నిర్వహణ వంటి వాటిపై రాష్ట్రాల సరిహద్దు అధికారులు నిఘా ఉంచి అప్రమత్తంగా పనిచేసి ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. సామాన్య ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జాతీయ రహదారి కలుపుకొని ఉన్న అన్ని గ్రామీణ రహదారుల పై పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలన్నారు. ప్రయాణికులు దయచేసి రూ. 50 వేల కన్నా ఎక్కువ తీసుకువెళ్తే సంబంధిత డాక్యుమెంట్లను చూపించాలని ,ఎక్కువ మొత్తంలో ఆభరణాలు, దుస్తులు ,ఎలక్ట్రానిక్ పరికరాలను రవాణా చేస్తున్న సరైన ఆధారాలను చూపించాలని ఆయన పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఏసీపీ రవి కిరణ్, రూరల్ సీఐ రజిత రెడ్డి, జగ్గయ్యపేట సీఐ జానకిరామ్, కోదాడ రూరల్ ఎస్సైలు అనిల్ రెడ్డి, చిలకల్లు ఎస్సై సతీష్ చిలుకూరు ఎస్సై సురభి రాంబాబు గౌడ్, రెండు రాష్ట్రాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed