కృష్ణమ్మ ఒడిలో మరో అద్భుత ద్వీపం..

by Aamani |
కృష్ణమ్మ ఒడిలో మరో అద్భుత ద్వీపం..
X

దిశ,నాగార్జునసాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ ప్రాంతంలోని టూరిస్ట్ ప్లేసుల జాబితాలో మరో కలికితురాయి చేరనుంది. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం... ఎటుచూసినా ఆకాశాన్నంటే ఎత్తులో చెట్లు, సందడి చేసే పక్షుల కిలకిలా రావాలు.. ఆ అడవిని చీల్చుకుంటూ సుడులు తిరుగుతూ ప్రవహించే నీలిరంగు కృష్ణమ్మ జల సవ్వడులు.. ఇలాంటి అత్యద్భుతమైన సుందర దృశ్యాలకు నెలవైన నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాల జాబితాలో మరో కలికితురాయి చేరబోతోంది. కృష్ణమ్మ ఒడిలో మరో అద్భుత పర్యాటక ప్రాంతం అందుబాటులోకి రాబోతోంది.

నాగార్జున కొండకు సరిగ్గా 3 కి.మీ. దూరంలోని చాకలి గట్టుకు మధ్యన రోప్‌వేలు, బోటింగ్‌, ట్రెక్కింగ్‌ వంటివి ఏర్పాటు చేస్తే అంతర్జాతీయ టూరిస్టులను సైతం ఆకర్షించవచ్చని పర్యాటక శాఖ యోచిస్తోంది. ఈ దిశగా అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చాకలిగట్టు ప్రాంతం మధ్య, కొత్త రాతి యుగాల్లో ఆదిమానవుల ఆవాసంగా ఉందని పురావస్తు నిపుణులు చెబుతున్నారు. వారు చేపట్టిన తవ్వకాల్లో ఇందుకు సంబంధించి పలు ఆధారాలు కూడా వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలోనే చాకలి గట్టు ద్వీపాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే అంశంపై నాగార్జునసాగర్ జలాశయం మధ్యలో ఉన్న చాకలి గట్టు, ఏలేశ్వరం కొండపై ఎకో టూరిజం అభివృద్ధికి టూరిజం ఉన్నతాధికారులు గురువారం నాడు స్థల పరిశీలన చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ,యువజన సర్వీసుల, రాష్ట్ర పురావస్తు శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ ఆధ్వర్యంలో టూరిజం లాంచిలో చాకలి గట్టు చేరుకొని ఎకో టూరిజం అభివృద్ధికై పరిశీలించారు. నాగార్జునసాగర్ జలాశయంలో తెలంగాణ అటవీశాఖ సాగర్ డివిజన్ పరిధిలో ఉన్న 415 ఎకరాల వైశాల్యం గల చాకలి గట్టుపై గత కొన్ని రోజులుగా నాగార్జునకొండ ,బుద్ధ వనం తో పాటు చాకలి గట్టుపై టూరిజాన్ని అభివృద్ధి చేయాలనీ ప్రతిపాదనలు జరుగుతున్నాయి.

దీనికై గతంలో కూడా పలుమార్లు టూరిజం ఉన్నతాధికారులు పరిశీలించారు. కాగా గురువారంనాడు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన పర్యాటకశాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి ,టూరిజం మాజీ సీఎం డి బుద్ధవనం మెంటర్ చెన్నూరి ఆంజనేయ రెడ్డి ల తో కలిసి టూరిజం పురావస్తు అటవీశాఖ అధికారులతో చాకలి గట్టు చేరుకొని పరిశీలించారు .అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధవనం ప్రాజెక్టును మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడానికి చేపట్టాల్సిన ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎ కో టూరిజం అభివృద్ధిలో భాగంగా నాగార్జున సాగర్ జలాశయం లోని చాకలి గట్టు, ఏలేశ్వరం కొండ లలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా గురువారం నాడు చాకలి గట్టును సందర్శించి పరిశీలించామన్నారు. చాకలి గట్టుపై ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా త్వరలోనే సర్వే నిర్వహిస్తామన్నారు చాకలి గట్టుపై బోటింగ్ అవకాశాలు, వాటర్ స్పోర్ట్స్, క్యాంపింగ్ లాంటివి ఏర్పాటుకై అటవీశాఖ ఉన్నత అధికారులతో కలిసి సమావేశమై పూర్తిస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. బుద్ధ వనము లో మరిన్ని నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్లో బుద్ధ వనములో మిగిలిపోయి ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.

బుద్ధ వనం త్వరలోనే సీసీ కెమెరాల పర్యవేక్షణలో తీసుకువస్తున్నామన్నారు. వీరితో పాటు బౌద్ధ నిపుణులు, బుద్ధవనం కన్సల్టెంట్, చారిత్రక పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్లు నారాయణ ,నాగరాజు,తెలంగాణ టూరిజం సి ఈ వెంకటరమణ,టూరిజం హోటల్స్ జనరల్ మేనేజర్ నాదన్,టూరిజం వాటర్ ఫ్లూ యి ట్ జనరల్ మేనేజర్ ఇబ్రహీం,బుద్ధవనం ఓ ఎస్ డి సుధన్ రెడ్డి, ఎఫ్ డి ఓ .సంగీత,బుద్దవనం డీఈలు దామోదర్ , సుదర్శన్,బుద్ధ వనం డిజైన్ ఇంచార్జ్ శ్యామసుందర్ రావు,బుద్ధవనం ఏఈ నజీష్,విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్, లాంచి యూనిటీ మేనేజర్ హరి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed