- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Yadagirigutta : కార్తీక మసోత్సవాలకు సర్వత్ర సిద్దం
దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే కార్తీక మాసోత్సవాలకు యాదగిరిగుట్ట( Yadagirigutta ) ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. మంగళవారం ఆయన కొండపైన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మట్లాడుతూ.. సత్యనారాయణ స్వామి వ్రతాల కోసం భక్తులు తరలివస్తారని..అందుకు తగినట్లుగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల రోజుల పాటు నిత్యం ఆరు దఫాలుగా వ్రతాలు జరిపించనున్నట్లు ఈవో తెలిపారు. కొండ కింద వ్రత మండపం హాల్ లో ఉదయం 7 గంటల నుంచి ప్రతి రెండు గంటలకోసారి సాయంత్రం 6 గంటల వరకూ వ్రతాలు కొనసాగుతాయని తెలియజేశారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 15వ తేదిన కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7 వరకు 8 బ్యాచ్ ల చొప్పున వ్రతాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఐదు బ్యాచుల చొప్పున వ్రతాలు నిర్వహించనున్నట్లు, కార్తీకమాసం రోజు 6 బ్యాచ్ లు నిర్వహించన్నట్లు చెప్పారు. కార్తీక పౌర్ణమి రోజు కొండపైన శివాలయంలో సాయంత్రం ఆకాశదీపారాధన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.