- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
medical services : రాత్రి వేళల్లో ప్రధాన వైద్య సేవలన్నీ బంద్..?
దిశ, తుంగతుర్తి : పేరుకు పెద్దరికమే.. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అంతంత మాత్రమే..! ఈ లెక్కన నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలోని ఏరియా ఆసుపత్రి పనితీరు ఉంది. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా ఇక్కడ వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు. పేరుకే “24 గంటల వైద్య సేవలు” అనే నినాదంతో కొనసాగుతున్న ఈ ఆసుపత్రిలో రాత్రి సేవలు అనేక ఆటంకాలతో కొనసాగుతున్నాయి. దీనికంతటికి ప్రధాన కారణం డాక్టర్ల కొరతే...! డాక్టర్లను నియమించాలంటూ ఉన్నతాధికారులకు గత కొంతకాలంగా వినతులు వెళ్లినప్పటికీ అవన్నీ బుట్ట దాఖలు అవుతున్నాయి. పైగా డిప్యూటేషన్ పై వచ్చిన ముగ్గురు డాక్టర్లలో ఒకరు హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి వెళ్లడంతో కేవలం ఇద్దరు మాత్రమే విధుల్లో కొనసాగుతున్నారు. వారు కూడా సాయంత్రం వరకే. ఇక తదనంతరం వచ్చే రోగులకు నర్సింగ్ స్టాఫ్ దిక్కు. వారు కూడా కేవలం ఫస్ట్ ఎయిడ్ వరకే పరిమితమవుతూ ఉన్నత సేవల కోసం సూర్యాపేటకు పంపిస్తున్నారు. చివరికి సాధారణ కాన్పులు కూడా నిలిచిపోయాయి.
ముఖ్యంగా దాదాపు రెండేళ్ల క్రితం 33 వడకలతో కొనసాగిన సామాజిక ఆరోగ్య కేంద్రం తదనంతరం వైద్య విధాన పరిషత్ లోకి వెళ్ళి వంద పడకలకు చేరింది. ఈ మేరకు ఆసుపత్రిలో 40 మందికి పైగా వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఉండాలి. కానీ ఇద్దరు వైద్యులు మాత్రమే ఉన్నారు. ఇదిలా ఉంటే ఎక్స్ రే విభాగాధిపతి దాదాపు వారం రోజుల క్రితం బదిలీ పై వెళ్లినప్పటికీ ఖాళీ అయిన ఆ స్థానంలోకి ఎవరు రాలేదు. ఫలితంగా అది కూడా మూతబడింది.
10 నుంచి 200 పైకి చేరిన రోగులు..
ఒకప్పుడు వేళ్ళ మీద లెక్కించే రీతిలో ఆసుపత్రికి వచ్చిన రోగుల సంఖ్య నేడు వందల్లోకి చేరింది. ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి 200 పైగా రోగులు ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. ఇదంతా గొప్పగా చెప్పుకునే విషయమే అయినప్పటికీ పూర్తిస్థాయి డాక్టర్లు లేక రోగులు విలవిలలాడుతున్నారు. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజానీకం విజ్ఞప్తి చేస్తోంది.