డబల్ బెడ్ రూమ్ ఇండ్ల అవకతవకల పై గ్రామస్తుల ఆందోళన..

by Sumithra |
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల అవకతవకల పై గ్రామస్తుల ఆందోళన..
X

దిశ, మునగాల : మునగాల మండల పరిధిలోని ఆకుపాముల గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో శుక్రవారం జరిగిన లబ్ధిదారుల ఎంపిక లాటరీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామస్తులు శనివారం పంచాయతీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అధికారులను ఆఫీస్ లోకి వెళ్లకుండా ముళ్ళ కంప అడ్డుగవేసి ధర్నాకు దిగి స్థానిక లబ్ధిదారులు ఆఫీసు ముందే టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని అన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇల్లు, భూములు ఉన్నవారికి మంజూరు చేసి, రోడ్లమీద ఎటువంటి నివాసం లేకుండా జీవిస్తున్న తమకు ఎందుకు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు.

స్థానిక సర్పంచ్ తోపాటు అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఆఫీసర్లు అసలైన నిరుపేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకి ఇష్టమైన అనర్హుల పేర్లను అర్హుల జాబితాలో ఉంచి అసలైన నిరుపేద లబ్ధిదారులను విస్మరించారని అన్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో కాకుండా కోదాడ పట్టణంలో పోలీస్ పహారా మధ్య డ్రా తీయడం ఏమిటని ప్రశ్నించారు. ఆఫీసర్లు అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఈ అవకతగులపై విచాన జరిపి మళ్లీ అర్హులైన వారి జాబితా తయారుచేసి లబ్ధిదారుల ను ఎంపిక చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed