- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వసతి.. అధ్వానం! సంక్షేమ హాస్టళ్లలో సమస్యల తిష్ఠ
దిశ, నల్లగొండ బ్యూరో: విద్యాపరంగా ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా నిరుపేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించి వారిని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడమే సంక్షేమ వసతి గృహాల ప్రధాన ఉద్దేశం. కానీ నేడు వసతి గృహాలు నరక కూపాలుగా మారిపోయాయి. పర్యవేక్షించే అధికారులు లేకపోవడంతో విద్యార్థులు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా వాళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ మొత్తుకున్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎస్సీ సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై స్పెషల్ రిపోర్ట్.
ఉమ్మడి జిల్లాలో వసతి గృహాలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 87, పోస్టు మెట్రిక్ హాస్టల్స్ 23 ఉండగా ఇందులో మొత్తం హాస్టల్ విద్యార్థులు దాదాపు 7 వేల మంది వసతి పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రీ, పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ 21 ఉన్నాయి. అందులో 1,200 మంది విద్యార్థులు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 38 రాష్ట్రాలు ఉన్నాయి అందులో దాదాపు 3 వేల మంది విద్యార్థులు, నల్లగొండ జిల్లాలో 61 హాస్టల్స్ అందులో దాదాపు 4,500 మంది విద్యార్థులు ప్రస్తుతం వసతి పొందుతున్నారు. ఆ విద్యార్థుల కోసం మెస్ చార్జీల కింద 5వ నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.900, 9 నుంచి 10వ తరగతి వరకు రూ.1,050, ఇంటర్ ఆపై చదువులు చదువుకొనే విద్యార్థుల కోసం రూ.1,500 మెస్ చార్జీల పేరుతో అందిస్తున్నారు.
నరక కూపాలుగా మారిన హాస్టల్స్..
ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు అంటే ఒకప్పుడు సొంత ఇంటితో సమానంగా భావించే వారు విద్యార్థులు. కానీ, నేడు అవే ఇప్పుడు వారికి నరక కూపాలుగా దర్శనమిస్తున్నాయి. 60 శాతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో చిన్న చర్చి పక్కనే ఉన్న ఒక ఎస్సీ బాలుర హాస్టల్‌కు కిటికీలకు, తలుపులు లేక విద్యార్థులు బస్తాలు అడ్డుగా కట్టుకున్నారు. మరుగుదొడ్లు పందుల కొట్టాల కంటే హీనంగా ఉన్నాయి. మునుగోడు వసతి గృహం పూర్తిగా పెచ్చులుడిపోతూ శిథిలావస్థకు చేరింది. హాస్టల్లో విద్యార్థులకు నీళ్లు అవసరం ఉంటే విద్యార్థులు ట్యాంకుల నుంచి బకెట్లతో తీసుకోవాల్సిందే. భువనగిరి జిల్లాలోని హుస్నాబాద్ ఎస్సీ బాలుర హాస్టల్లో మరుగుదొడ్లు కంపు కొడుతూ.. తలుపులు విరిగిపోయి ఉన్నాయి. హాస్టల్లో ఉన్న గదులకు ఉన్న తలుపుల కూడా విరిగిపోయి ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో మరుగుదొడ్లు కంపు కొడుతున్న పట్టించుకునే దిక్కు లేదు. ఆత్మకూర్ (ఎస్) వసతి గృహం అడవిని తలపించేలా ఉంది. విష సర్పాలు తిరిగి అవకాశం ఉన్నా అధికారులకు పట్టించుకున్న పాపాన పోవట్లేదు.
మెస్‌లలో ఇష్టా రాజ్యం..
పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా గత ప్రభుత్వం హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచింది. అందరికీ ఒకే రకమైన బడ్జెట్ అంటే కుదరదా అనే ఉద్దేశంతో మూడు రకాలుగా మెస్ బిల్లులు ప్రభుత్వం చెల్లిస్తుంది. అయినా.. వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సరైన పౌష్టికారం అందించట్లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రజా సంఘాలు హాస్టల్ నిర్వాణపై సర్వే నిర్వహించారు. భోజనం బాగోలేదు.. అడిగితే వార్డెన్ కసురుకుంటున్నారని విద్యార్థులు దీనంగా సర్వే చేసిన వారికి తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అడిగినా విద్యార్థులను వార్డెన్లు ముఖ్యంగా మహిళ వార్డెన్ విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శలున్నాయి.
గతంలో ఓ మహిళా వార్డెన్ బయటి వ్యక్తులతో అమ్మాయిలను భయభ్రాంతులకు గురిచేసినట్లు నేరుగా కలెక్టర్ ముందే విద్యార్థినులు చెప్పిన విషయం అందరికీ తెలిసింది. సరైన భోజనం, సౌకర్యాలు కల్పించడం లేదని అడిగిన విద్యార్థి సంఘాలను పోలీసు కేసులు పెట్టి జైలుకు పంపించిన సంఘటనలు గతంలో జరిగాయి. ఇలాంటి పరిస్థితులలో జిల్లా పాలనాధికారి జోక్యం చేసుకునే తప్ప విద్యార్థుల పౌష్టికారం అందించడంలో మార్పు వచ్చే అవకాశం లేదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది వార్డెన్లు తమ స్థానం నుంచి బదిలీ అయ్యి ఇప్పటికి వారం రోజులు గడిచిన బదిలీపై వచ్చిన వార్డెన్‌కి చార్జ్ ఇవ్వడానికి ససేమిరా అని ఒప్పుకోవడం లేదు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: కోటేశ్వరరావు ఇంచార్జ్ డీడీ
వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఉద్యోగుల బదిలీ కారణంగా ఆలస్యమైంది. మరో రెండు మూడు రోజుల్లో బడ్జెట్ విడుదల చేసి సౌకర్యాలు కల్పిస్తాం.