అమెరికాలో రోడ్డు ప్రమాదం.. యాదగిరిగుట్టకి చెందిన యువతి స్పాట్ డెడ్

by Satheesh |   ( Updated:2024-05-28 15:10:00.0  )
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. యాదగిరిగుట్టకి చెందిన యువతి స్పాట్ డెడ్
X

దిశ, యాదగిరిగుట్ట: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన గుంటపల్లి కోటేశ్వరరావు, గుంటపల్లి బాలమణిల కూతురు గుంటపల్లి సౌమ్య (24) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లింది. అయితే (భారత్ కాలమాన ప్రకారం) ఆదివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో అతి వేగంగా వచ్చిన ఒక కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అమెరికాలో చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుందని యాదగిరిపల్లి గ్రామ ప్రజలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదుగుతుందనుకున్న బిడ్డ మృతి చెందడంతో సౌమ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed