- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మురిసిన మువ్వన్నెల జెండా
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే, డీసీపీ రాజేష్ చంద్రతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అన్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. వివిధ పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అతిథులను ఆకట్టుకున్నాయి. ఆయా శాఖల శకటాల ప్రదర్శన, స్టాల్స్ ప్రదర్శన ద్వారా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్వాతంత్య్ర సమరయోధులు మన్నె గోపాల్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అడిషనల్ కలెక్టర్లు బెన్ శాలోమ్, గంగాధర్, ఆర్డీవో అమరేందర్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.