విచిత్రమైన డ్రా...విస్తూ పోతున్న జనం

by Sridhar Babu |
విచిత్రమైన డ్రా...విస్తూ పోతున్న జనం
X

దిశ, మర్రిగూడ : మనం ఇప్పటి వరకు డబ్బులు, వస్తువులు అందించే బంపర్​ డ్రాలు చూశాం. కానీ ఈ విచిత్రమైన డ్రాను ఎక్కడైనా చూసి ఉంటారో లేదో తెలియదు. అలాంటి విచిత్రమైన డ్రాను మర్రిగూడ మండల కేంద్రంతో పాటు లెంకలపల్లి గ్రామంలో నిర్వాహకులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే రూ.100 నోటు కొట్టు దసరా జల్సా చేసుకునేందుకు మేకను పట్టు అని సోషల్ మీడియాలో బంపర్ ఆఫర్లు ట్రోలు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండల కేంద్రంతో పాటు లెంకలపల్లి గ్రామంలో నిర్వాహకులు ఈ బంపర్ డ్రాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

రూ. 100 చెల్లిస్తే మొదటి బహుమతిగా 10 కిలోల మేకను, రెండవ బహుమతిగా 2 బ్లండర్ప్రైడ్ ఫుల్ బాటిళ్లు, మూడో బహుమతిగా కాటన్ బీర్లు, నాలుగో బహుమతిగా రెండు నాటు కోళ్లు, ఐదవ బహుమతిగా ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ను బంపర్ డ్రాగా ప్రకటించారు. దసరాకు రెండు రోజుల ముందు మండల కేంద్రాల్లోని పాత బస్టాండ్ లో, అలాగే లెంకలపల్లి గ్రామంలో గాంధీ సెంటర్ వద్ద సాయంత్రం 6 గంటలకు బంపర్ డ్రా తీయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దాంతో ఇదెక్కడి విచిత్రమని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed