Cameron Green: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌..గాయంతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం..!

by Maddikunta Saikiran |
Cameron Green: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్‌..గాయంతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీకి స్టార్ ఆల్‌రౌండర్‌ దూరం..!
X

దిశ, వెబ్‌డెస్క్:ఇంగ్లండ్(England) పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా (Australia)కు బిగ్ షాక్‌ తగిలింది.ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌,25 ఏళ్ల కామెరూన్‌ గ్రీన్‌(Cameron Green) గాయం కారణంగా ఇంగ్లండ్ తో మిగిలిన రెండు ODIల నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు.చెస్టర్-లీ-స్ట్రీట్‌(Chester-le-Street) వేదికగా మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో గ్రీన్‌ గాయపడ్డట్టు తెలుస్తోంది. నాలుగో వన్డేకు ముందు నిర్వహించిన వైద్య పరీక్షలలో అతడి వెన్నుకు గాయమైనట్టు తేలింది. దీంతో ఆస్ట్రేలియాకు తిరుగు ప్రయాణమయ్యాడు. గాయం​ తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం​ లేదు. కాగా గ్రీన్‌ మూడో వన్డేలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. ఆ మ్యాచ్‌లో గ్రీన్‌ 2 వికెట్లు తీసి 45 పరుగులు చేశాడు. గాయం తీవ్రత ఎక్కువైతే నవంబర్‌ నుంచి జరిగే భారత్‌- ఆసీస్‌(IND-AUS) మధ్య జరగబోయే బోర్డర్‌-గవాస్కర్‌ టెస్ట్ సిరీస్‌ (Border-Gavaskar Test series)లో అతడు ఆడేది అనుమానమేనని క్రికెట్‌ ఆస్ట్రేలియా(CA) వర్గాల సమాచారం.

Advertisement

Next Story

Most Viewed