- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vande Bharat Train: వందే భారత్ రైళ్లకు విదేశాల్లో భారీ డిమాండ్
దిశ, నేషనల్ బ్యూరో: భారత స్వంత వందే భారత్ రైళ్లకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. చిలీ, కెనడా, మలేషియా లాంటి దేశాలు భారత్ నుంచి వందే భారత్ రైళ్లను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇతర దేశాలలో తయారైన రైళ్ల ధర రూ. 160-180 కోట్ల వరకు ఉంటుందని, అయితే భారత్‌కు చెందిన వందే భారత్ రైళ్లు అవే ఫీచర్లతో రూ. 120-130 కోట్ల తక్కువ ధరకు లభిస్తుండటమే ఈ డిమాండ్‌కు కారణం. అంతేకాకుండా వేగంగా ప్రయాణించడంలోనూ వందే భారత్ రైళ్లు ముందువరుసలో ఉన్నాయి. వందే భారత్ రైళ్లు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునేందుకు కేవలం 52 సెకన్ల సమయం తీసుకుంటుంది. జపాన్‌కు చెందిన బుల్లెట్ రైళ్లు ఇదే వేగం అందుకునేందుకు 54 సెకన్ల సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఈ రైళ్లు విమానం కంటే వంద రెట్లు తక్కువ శబ్దాన్ని విడుదల చేస్తాయని, ఇంధన వినియోగం కూడా చాలా తక్కువగా ఉండటంతో అనేక దేశాలు వందే భారత్ రైళ్ల పట్ల ఆకర్షితులవుతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విదేశాల నుంచి పోటీని తట్టుకునేందుకు భారత ప్రభుత్వం వీలైనంత వేగంగా రైళ్ల తయారీని పెంచాలని, దేశీయంగా కూడా ట్రాక్‌ల నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించాలని భావిస్తోంది.