Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

by Maddikunta Saikiran |
Ponguleti Srinivasa Reddy: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్:తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి(Telangana Revenue Minister) పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) నివాసంలో ఈడీ(ED) సోదాలు ముగిశాయి.ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు ఏకకాలంలో 15 చోట్ల త‌నిఖీలు చేపట్టాయి.హైదరాబాద్‌లో గల ఆయన నివాసాలు, కార్యాలయాలలో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు.ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.ల‌గ్జ‌రీ వాచ్‌ల(luxury watches) కుంభ‌కోణం నేప‌థ్యంలోనే ఈడీ దాడులు చేపట్టినట్లు సమాచారం. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈడీ అధికారులు పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.మళ్లీ ఇప్పుడు ఈడీ త‌నిఖీలు చేపట్టడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.కాగా ఈ దాడులపై అధికార కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే బీజేపీ ప్రభుత్వం.. ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రత్యర్థుల ఇళ్లపై సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను పంపి,తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీ వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed