రాత్రికి రాత్రే కల్నల్ వీబీబి రెడ్డి విగ్రహం ఏర్పాటు

by Aamani |
రాత్రికి రాత్రే కల్నల్ వీబీబి రెడ్డి విగ్రహం ఏర్పాటు
X

దిశ,బొమ్మలరామారం : మండల కేంద్రం గుడి బావి చౌరస్తా వద్ద డబుల్ రోడ్డు డివైడర్ మధ్యలో గత సంవత్సరం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన లెఫ్టినెంట్ కల్నల్ ఉప్పల వినయ్ భాను రెడ్డి విగ్రహాన్ని సోమవారం రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటు చేసి తెల్లారేసరికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు. ఈ విగ్రహ ఏర్పాటు కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే,జిల్లా మంత్రి నీ కలిసినా ఆర్ అండ్ బి నిబంధనల ప్రకారం, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీంతో ఆ పనులు ఆగిపోయాయి. విగ్రహ ఏర్పాటు కోసం రోడ్డుపై గుంతను తవ్వితే స్థానిక ఎస్ ఐ అనుమతులు లేని కారణంగా పనులను ఆపివేయించారు .

అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రే విగ్రహం ఏర్పాటుకు అనుమతులు ఎలా వచ్చాయి అని గ్రామస్తులు అనుకుంటున్నారు. గతంలో మండల కేంద్రంలో భారత మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ,బాబు జగ్జీవన్ రాం, వివేకానంద ,తెలంగాణ తల్లి, శివాజీ,మాధవ రెడ్డి విగ్రహావిష్కరణ కు యువజన ,కుల సంఘాలు ఎంతో తీవ్రంగా ప్రయత్నించినా అనుమతులు లభించలేదు. ఆర్ అండ్ బి నిబంధనల ప్రకారం వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించేలా రోడ్డు పైన విగ్రహాలు,ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేవు. అలాంటిది నేడు రోడ్డు మధ్యలో అనుమతులు ఎలా వచ్చాయో అంటూ పలు సంఘాల నాయకులు అనుకుంటున్నారు.స్థానిక ఎమ్మెల్యే సహకారంతోనే విగ్రహ ఏర్పాటు జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనా రాత్రికి రాత్రే కల్నల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరైన నివాళులు కాదని మండల ప్రజలు అనుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed