- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Accident: గరిడేపల్లి వద్ద ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ ఢీ
దిశ హుజూర్నగర్/ గరిడేపల్లి: షిరిడి వెళ్లి సాయిబాబాని దర్శించుకుని తిరిగి తమ ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు వెళ్తున్న బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 15 మంది స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గరిడేపల్లి ఎస్సై సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం విశాఖపట్నం కాకినాడ జిల్లాకు చెందిన 25 మంది సాయిబాబా భక్తులు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో జులై 24న బయలుదేరి వెళ్లి షిరిడి సాయి బాబాను దర్శించుకున్నారు. ఈ తీర్థయాత్రకు వెళ్లిన వారంతా సాయిబాబా భక్తులు కావడంతో మార్గమధ్యంలోని సాయిబాబా టెంపుల్‌లను దర్శించుకుంటూ వెళ్తున్నారు. బుధవారం రాత్రి నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామ శివారులోని సాయిబాబా గుడిని సందర్శించి పూజలు నిర్వహించుకున్నారు.
రాత్రి తిరిగి వెళ్తుండగా కీతువారిగూడెం గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ సమీపంలో రాగానే ఆ బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ముందు భాగంలో డ్రైవర్ పక్కనే కూర్చున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మరో 15 మందికి స్వల్ప గాయాలు అయినట్లు తెలిపారు. ఈ బస్సులో ప్రయాణికులంతా 50 సంవత్సరాల పైబడిన వారే ఉన్నారని, అందులో 19 మంది మహిళలు ఆరుగురు మగవారు మాత్రమే ఉన్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే వారిని హుజూర్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కి తరలించినామని తెలిపారు. ఈ ప్రమాదంలో 15 మంది కి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందించామని ముగ్గురికి తీవ్రంగా ఉండడంతో సూర్యాపేట జిల్లా హాస్పిటల్ తరలించామని, ప్రస్తుతం రాత్రి ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చేరిన వారందరినీ ఉదయం డిశ్చార్జ్ చేశామని హుజూర్ నగర్ ప్రభుత్వ ఏరియా సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.