- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
దిశ, మునగాల :సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ,కులగణనపై నిర్వహించే ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పి డిప్యూటీసీఈవో మండల ప్రత్యేక అధికారిణి శిరీష అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎన్యుమరేటర్లకు ,సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ రోజు నుండి ఈ నెల 18వ తారీఖు వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఈ డేటా ఎంట్రీ కోసం తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మండల వ్యాప్తంగా 86 న్యూమరేషన్ బ్లాకులకు 110 మంది ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. ఇంటింటి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు సర్వే మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, డిప్యూటీ తాసిల్దార్ సత్యనారాయణ ఆర్ఐ రామారావు,ఎంపీ ఓ దార శ్రీను, ఏపీవో శైలజ, తదితరులు పాల్గొన్నారు.