Fire Accident : ఒకవైపు వర్షం.. కారులో మంటలు.. బయటకు దూకిన తండ్రి కొడుకులు

by Ramesh N |
Fire Accident : ఒకవైపు వర్షం.. కారులో మంటలు.. బయటకు దూకిన తండ్రి కొడుకులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నల్లగొండ జిల్లాలో హైవేపై తాజాగా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద హైవే- 65 వద్ద ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు కారును పక్కకు ఆపి బయటకు దూకారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తండ్రి కొడుకులు కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వర్షం కూడా కురుస్తోంది. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed