షార్ట్ సర్క్యూట్.. 3 లక్షల నగదు దగ్ధం

by Vinod kumar |
షార్ట్ సర్క్యూట్.. 3 లక్షల నగదు దగ్ధం
X

దిశ, మోత్కూరు: షార్ట్ సర్క్యూట్‌తో 3 లక్షల నగదు ఇంట్లో సామాగ్రి అగ్నికి ఆహుతైన ఘటన మండలంలోని రాగిబావిలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. రాయి బావికి చెందిన ఎలుగ సత్తిరెడ్డి ఇంటికి తాళం వేసి ఈరోజు ఊర్లో బోనాల పండుగ కావడంతో అత్తవారి బావి వద్దకు వనవాసం వెళ్లారు.

మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి పొగలు వస్తుండడంతో సమాచారం అందుకున్న సత్తిరెడ్డి వచ్చి చూడగా.. అప్పటికే ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ 3 లక్షల నగదు ఫర్నిచర్ సామాగ్రి తోపాటు పట్టాదారు పాస్ బుక్స్, డాక్యుమెంట్లు బూడిదైపోయాయి. సంఘటన స్థలిని స్థానిక సర్పంచ్ రాంపాక నాగయ్య సందర్శించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయి.. ప్రభుత్వపరంగా సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు.

Advertisement

Next Story

Most Viewed