అక్రమంగా తరలిస్తున్న బెల్లం, పట్టిక పట్టివేత..

by Sumithra |
అక్రమంగా తరలిస్తున్న బెల్లం, పట్టిక పట్టివేత..
X

దిశ, నేరేడుచర్ల (హుజూర్‌నగర్) : అక్రమంగా బెల్లం పటికను తన టీవీఎస్ మోటార్ సైకిల్ పై తరలిస్తున్న వ్యక్తితో పాటు తనఇంట్లో తయారుచేసిన బెల్లం సారా పానకం స్వాధీనం చేసుకుని ఆ వ్యక్తుల పై కేసునమోదు చేసినట్లు హుజూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి బుధవారం విలేకరులకు తెలిపారు. పెన్ పహాడ్ మండలంలోని దుపాడు గ్రామానికి చెందిన అరవింద్ అనే వ్యక్తి తన టీవీఎస్ మోటార్ సైకిల్ పై 50 కేజీల బెల్లం, 10 కేజీల పట్టికను వ్యాపారస్తులకు విక్రయించేందుకు తరలిస్తుండగా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామం వద్ద బెల్లం పట్టికను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చింతలపాలెం మండలంలోని పీక్యా నాయక్ తండకు చెందిన బానోతు సుమన్ తండ్రి కోట్యా బానోత్ గోపి తండ్రి రెడ్యా నాయక్ ఇండ్లలో నిల్వ ఉంచిన 100 కేజీల బెల్లం, 10 లీటర్ల సారా, 1400 లీటర్ల పానకంను స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తుల పై కేసునమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు సతీష్ రెడ్డి, దివ్య, వెంకన్న సిబ్బంది నాగరాజు, జయరాజు, ధనుంజయ్, రాము, నాగమణి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed