Nagarkurnool: పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న విద్యార్థిని తల.. తప్పిన ప్రమాదం

by Ramesh Goud |   ( Updated:2024-12-06 16:53:48.0  )
Nagarkurnool: పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న విద్యార్థిని తల.. తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) ప్రభుత్వ పాఠశాలలో(Government School) విద్యార్థినికి పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అచ్చంపేట మండలంలోని పులిజాల ప్రాథమిక పాఠశాలలో(Pulijala Primary School) మూడో తరగతి చదువుతున్న సరిత(Saritha) పాఠశాల ప్రాంగణంలో తోటి విద్యార్ధినిలతో కలిసి ఆడుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విద్యార్ధిని తల రెండు క్లాస్ రూంల మధ్యలోని రెండు పిల్లర్ల సందులో ఇరుక్కుంది. తోటి విద్యార్థుల సమాచారంతో పాఠశాల సిబ్బంది(Scholl Staff) బాలిక తలను పిల్లర్ల మధ్య నుంచి తప్పించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గ్రామంలో పనిచేస్తున్న తాపి మేస్త్రీలను పిలిపించారు. వారు పాఠశాలకు వచ్చి సుత్తితో పిల్లర్లను ధ్వంసం చేసి విద్యార్థిని క్షేమంగా బయటకు తీశారు. విద్యార్ధినికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్కూల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

Most Viewed