- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. 22 గేట్లు ఎత్తివేత
దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 22 గేట్లను 5ఫీట్ల మేరకు ఎత్తి అధికారులు నీటిని పులిచింతలకు, దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌కు 3,00,995 క్యూసెక్కుల వరద వస్తున్నది. అతే మొత్తం కిందికి వెళ్తున్నది. క్రస్ట్ గేట్ల ద్వారా 2,55,296 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 7601 క్యూసెక్కులు, కుడి కాలువకు 7878, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,420 క్యూసెక్కులు, ఏఎమ్మార్ ప్రాజెక్టుకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుకాగా, ప్రస్తుత నీటి మట్టం 585.30 అడుగుల వద్ద నీరు ఉన్నది. జలాశయంలో గరిష్ట నీటినిల్వ 312.50 టీఎంసీలు. ఇప్పుడు 298.30 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. సాగర్ నుంచి భారీగా వరద దిగువకు వెళ్తుండటంతో సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ఇప్పుడు 142.71 అడుగులుగా ఉన్నది. 45.77 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికిగాను 10.65 టీఎంసీలు ఉన్నాయి. ప్రాజెక్టుకు 74,443 క్యూసెక్కుల వరద వస్తుండగా, 25,676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.