- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండా సురేఖపై నాగార్జున పిటిషన్.. విచారణ వాయిదా
దిశ, వెబ్ డెస్క్ : మహిళా మంత్రి కొండా సురేఖ(Konda Surekha) మీద సినీనటుడు అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) వేసిన పరువు నష్టం పిటిషన్ విచారణ వాయిదా పడింది. అక్కినేని కుటుంబ విషయాలను ప్రస్తావిస్తూ కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నాగార్జున.. కొండా సురేఖ తక్షణమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోవడంతో నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం పిటిషన్ వేశారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కాగా శనివారం లేదా సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నేత కేటీఆర్ మీద విమర్శలు చేయబోయి.. మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం మీద, సమంత-నాగచైతన్య విడాకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు గత రెండు రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని సురేఖ సమంతకు మాత్రమే సారీ చెప్పింది. కేటీఆర్, నాగార్జునలకు క్షమాపణలు చెప్పేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో నాగార్జున మంత్రి మీద న్యాయ పోరాటనికి సిద్ధమయ్యారు.