- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పార్టీ మార్పుపై తేల్చేసిన నాగం జనార్దన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: నాగం జనార్ధన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన అసమ్మతి వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడా కనిపించడం లేదు. దీంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోండగా.. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటానని, పార్టీ మార్పుపై వారిదే తుది నిర్ణయమని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూలులో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశానని, అలాంటి తనకు టికెట్ ఇవ్వకపోవడం చూసి బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బోగస్ సర్వేల పేరుతో ప్రజలు, నాయకులను మోసం చేస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు.