- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శిక్షణ పేరుతో నాబార్డ్ నిధుల స్వాహా.. కేంద్ర నిర్వాహకుడే కీలక సూత్రధారి!
దిశ, నల్లగొండ బ్యూరో: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణ కేంద్రంగా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ శిక్షణకు బదులు అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిందని తెలుస్తోంది. శిక్షణకు సరైన సౌకర్యాలు లేకపోవడం వసతి, ఉచిత భోజనం శిక్షణకు కావలసిన మెటీరియల్ సరైన పద్ధతిగా లేకపోవడమే కాకుండా వాటి పేరుతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. శిక్షణ సమయంలో అభ్యర్థులకు పెట్టే తిండిలో కూడా తమకేంటి లాభం అంటూ నిర్వాహకులు వెతుకుతున్నారని సమాచారం.
శిక్షణ పేరుతో నాబార్డ్ నిధుల స్వాహా
జిల్లా కేంద్రంలోని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్ఎస్ఈటిఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి నాబార్డ్ నుంచి 2020 21 2021 22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30 లక్షల నిధులను విడుదల చేశారు. ఆ నిధులతోనే శిక్షణ సంస్థలు కారు డ్రైవింగ్, మోటార్ వైండింగ్ ,సెల్ ఫోన్ మరమ్మతుల శిక్షణ ఈ రెండేళ్లలో మొత్తం ఏడు బ్యాచులకు శిక్షణ ఇచ్చారు. అయితే ఇక్కడ శిక్షణ తీసుకునే వారికి ఉచిత వసతి భోజనం, ఇతర ట్రైనింగ్ మెటీరియల్ కేంద్ర నిర్వాహకులే ఇవ్వాల్సి ఉంటుంది. కారు డ్రైవింగ్ శిక్షణలో 35 మంది అభ్యర్థులకు 30 రోజులు శిక్షణ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రతి అభ్యర్థిపై రెండు పూటల భోజనం ఉదయం టిఫిన్ కోసం సుమారు 150 రూపాయలు ఖర్చు చేస్తారు కాని వాస్తవంగా శిక్షణ తీసుకున్న 30రోజులు కూడా ఏ ఒక్క అభ్యర్థికి ఒక్క టీ కూడా ఇవ్వలేదు.
ఎందుకంటే వారంతా నాన్ రెసిడెన్షియల్‌గా ఉండేవాళ్ళు అయితే దానికి సంబంధించిన మొత్తం భోజనం ఖర్చు పేరుతో సుమారు మూడు లక్షలకుపైగా సంస్థ నిర్వాహకులే కాచేసినట్లు వినికిడి. ఇదే కాకుండా కారు డ్రైవింగ్ రెండో బ్యాచ్ కూడా శిక్షణ కల్పించి ఆ సమయంలో కూడా ఇదే పద్ధతిని అవలంబించి నిధులు మరో మూడు లక్షలు తమ జేబులో వేసుకున్నారని సమాచారం. సెల్ ఫోన్ రిపేర్, వైండింగ్ శిక్షణ సమయంలో కూడా ప్రతి బ్యాచ్కు 35 మంది చొప్పున 30 రోజుల శిక్షణ ఇచ్చారు. ఈ రెండు కోర్సులకు సంబంధించి మొత్తంగా నాలుగు బ్యాచులకు శిక్షణ ఇచ్చారు. అయితే అభ్యర్థుల పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ ఫిజికల్ గా వారంతా సగానికి పైగా వసతి గృహంలో ఉండేవారు కాదు. ఇదే అదులుగా భావించిన నిర్వాహకులు భోజనాలు ఇతర ఖర్చుల పేరుతో సుమారు రెండు లక్షల పైగా స్వాహా చేసినట్లు సమాచారం. ఈ మొత్తం ఎపిసోడ్లో శిక్షణ సంస్థ నిర్వాహకులే కీలకపాత్రధారులను వినిపిస్తోంది.
భోజనాల పేరుతో నిధులు కాజేసిన నిర్వాహకులు
2021 -22 సంవత్సరం ఏప్రిల్ ఏడు నుంచి మే 6 వరకు మహిళలకు నిడమానూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ పక్కనే ఉన్న స్త్రీ శక్తి భవన్లో 30 రోజులపాటు 35 మంది శిక్షణ ఇచ్చారు. దీనికోసం పూర్తిగా స్థానిక అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. అయితే వీరంతా ఉదయం శిక్షణ కేంద్రానికి వచ్చి సాయంత్రం వారి వారి గ్రామాలకు వెళ్ళిపోయారు. అక్కడికి వచ్చిన శిక్షణ అభ్యర్థులకు ఒక్క పూట కూడా భోజనం పెట్టలేదని సమాచారం. కానీ శిక్షణ సంస్థ నిర్వాహకులు మాత్రం నల్లగొండలోని శిక్షణ కేంద్రంలోని శిక్షణ ఇచ్చినట్లు నమోదు చేశారు. దాని ప్రకారం అభ్యర్థులకు రెండు పూటలా భోజనం ఒక పూట టిఫిన్, ఇతర స్నాక్స్ ఇచ్చినట్లు తప్పుడు బిల్లులు పెట్టి లక్షకు పైగా సొమ్మును జేబులో వేసుకున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా 2021 22 జూలై నెలలో కట్టంగూరు మండలం నల్లగొండ మండలం లోని ఎంపీడీవో ఆఫీస్ లో మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు జనరల్ ఈడీపీ లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కోర్సులో రెండిట్లో కలిపి 70 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ రెండు కోర్సులకు కూడా స్థానిక యువతని ఎంపిక చేశారు. ఉదయం శిక్షణ కేంద్రానికి వచ్చి సాయంత్రం తిరిగి వెళ్లిపోయేవారు అభ్యర్థులు అయితే ఈ అభ్యర్థులకు సంబంధించిన భోజనం వసతి ఇతర బిల్లులను కూడా కేంద్రం నిర్వాహకులే నకిలీ బిల్లుల పేరుతో మెక్కేసినట్లు సమాచారం. శిక్షణ పేరుతో నిరుద్యోగ యువకుల కోసం కేటాయించిన నిధులను అధికారులపై క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఇక్కడే శిక్షణ పొందిన పలువురు నిరుద్యోగులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.