- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 గంటలైనా కనిపించని సూర్యుడు.. మధ్యాహ్నానికే అస్తమయం.. దేవుడు లేని ఆలయం.. ఎక్కడుందీ వింత గ్రామం?
దిశ, వెబ్ డెస్క్: "క" సినిమా (KA Movie) చూశారా ? చూస్తే.. క్రిష్ణగిరి గ్రామం (Krishnagiri) గురించి ఏం చూపించారో తెలిసే ఉంటుంది. ఆ ఊరిలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అలుముకుంటుంది. అయితే ఇది సినిమాకే పరిమితం కాదు. నిజంగానే.. అన్నింటికంటే ముందే చీకటి పడే గ్రామం ఒకటి ఉంది. ఆ ఊరి పేరు మూడు జాముల కొదురుపాక (Kodurupaka). పేరులోనే ఉంది కదా మూడు జాములు అని. అన్ని ఊర్లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. 4 జాములుంటే కొదురుపాకలో మాత్రం 3 జాములే ఉంటాయి. ఇక్కడ సాయంత్రం ఉండదు. ఉదయం, మధ్యాహ్నం.. ఆ తర్వాత డైరెక్ట్ గా రాత్రే.
సాధారణంగా సూర్యాస్తమయం సాయంత్రం 6-6.30 సమయంలో జరుగుతుంది. కాలానికనుగుణంగా సూర్యాస్తమయ సమయాలు మారుతుంటాయి. కానీ.. కొదురుపాకలో మాత్రం 4 గంటలకే చీకటి పడుతుంది. అందుకు కారణం.. ఈ గ్రామం కొండల మధ్యలో ఉండటమే. గ్రామం చుట్టూ 4 కొండలు. 4 గంటలయ్యేసరికి సూర్యుడు కొండలచాటుకి వెళ్లిపోతాడు. అందుకే ఇక్కడ సాయంత్రం 4 గంటలకే చీకటి అలుముకుంటుంది. ఈ గ్రామం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో ఉంది.
చీకటి మాత్రమే కాదు.. వెలుతురు కూడా ఆలస్యంగానే వస్తుంది. చెప్పాలంటే.. పచ్చదనంతో నిండిన ఈ ఊరిపై సూర్యుడికి కనికరం లేదండి. ఇక్కడ సూర్యోదయం 8 గంటల తర్వాతే జరుగుతుంది. ఇది ఇప్పటిది కాదు.. శతాబ్దాల కాలంగా ఇదే పరిస్థితి. గ్రామ ప్రజలు కూడా దానికి అలవాటుపడిపోయారు. రంగనాయకుల గుట్టను ఆనుకుని ఉన్న ప్రాంతం వారికి మరీ ఇబ్బందిగా ఉండటంతో.. కొందరు వలస కూడా వెళ్లిపోయారు. కొత్తగా గ్రామానికి వచ్చినవారు.. ఉదయం, సాయంత్రం సమయాల్లో కాస్త గందరగోళానికి గురవుతారని గ్రామస్తులు చెబుతున్నారు.
మరో విశేషం అనాలో, ప్రత్యేకత అనాలోగాని.. గ్రామంలో ఆలయం ఉంది కానీ.. ఆలయంలో దేవుడు ఉండడు. ఏడాదికొకసారి మాత్రమే ఇక్కడ దేవుడు దర్శనమిస్తాడు. అవేవో శక్తులున్నాయని భ్రమపడకండి. దసరా పండుగకు దేవునిపల్లి నుంచి నంబులాద్రి నరసింహస్వామి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. రథయాత్రతో స్వామివారిని తీసుకొచ్చి ఉత్సవాలు జరుపుకున్నాక.. మర్నాడు దేవునిపల్లికి స్వామివారిని పంపిస్తారు. ఇది ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ.