- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజకీయాల్లో నా కొత్త ఇన్నింగ్స్.. అంబేడ్కర్ విగ్రహం ముందు ఆర్ఎస్పీ..
దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేల తెలంగాణ రాజకీయాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు బీజేపీ, కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదురైంది. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వరుసగా వెళుతున్న తరుణంలో ఇతర పార్టీ నుంచే బీఆర్ఎస్ పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరనున్నారు. తాజాగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆర్ఎస్పీ సోమవారం గులాబీ బాస్ కేసీఆర్ సమక్షంలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీలోకి చేరే ముందు ఆయన ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు తన అనుచరులతో చేరుకున్నారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి ఆర్ఎస్పీ ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘నేను ఈ రోజు రాజకీయాల్లో నా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించేటప్పుడు నాకు మార్గదర్శకత్వం వహించాలని బాబాసాహెబ్‌ని ప్రార్థించాను’ అని పేర్కొన్నారు.