ముత్యాలమ్మ ఆలయం ఘటన ఖండనీయం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

by Y. Venkata Narasimha Reddy |
ముత్యాలమ్మ ఆలయం ఘటన ఖండనీయం : మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ విధ్వంసం ఘటన ఖండనీయం, దురదృష్టకరమని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇలాంటి దుర్ఘటనలు చాలా బాధాకరమని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి భయంకర సంఘటనను చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ విగ్రహ విధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, బస్తీ వాసులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆలయ విధ్వంసంపై ప్రతి ఒక్కరు కలిసి రావాలని కోరారు. నిరసన తెలిపిన భక్తులపై లాఠీచార్జీ చేయడం సరైంది కాదన్నారు.

ఆలయ పరిసర ప్రాంతాలలో పోలీస్ పికెటింగ్ మూలంగా ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉత్తర మండలంలో శాంతియుత వాతావరణం ఉంటుందని, శాంతియుత వాతావరణాన్ని భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. ఆలయ సంప్రోక్షణ చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story