- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముథోల్‌లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే
దిశ, ఆదిలాబాద్ బ్యూరో : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనుకున్నట్లుగానే బీఆర్ఎస్ నేతలంతా వరుసకట్టి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ చేరగా, గురువారం ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి సీతక్క విఠల్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2014 కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన విఠల్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారంలో ఎన్నో రోజులుగా సాగుతోంది. మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్ రెడ్డి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం నేపథ్యంలో ఇంద్రకరణ్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి కంటే ముందు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.