- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.1000 కోట్ల కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆ యువకుడ్ని కాపాడిందా?
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జియాగూడ బైపాస్ రోడ్డుపై ఆదివారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని ముగ్గురు చుట్టుముట్టి కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కాగా, పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. ఈ ఇన్సిడెంట్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ''మహానగరం నడిబొడ్డున పట్టపగలే రోడ్డుపై ఇంత దారుణ హత్యా? రోడ్డుమీద అటుగా వెళ్తున్న వారెవరూ ఈ ఘోర హత్యను ఆపలేకపోయారు! మనమందరం ఒక సమాజంగా స్వార్థపరులుగా మరియు పట్టించుకోకుండా ఎలా మారాము? రూ.1000 కోట్ల కమాండ్ సెంటర్ మనల్ని కాపాడుతుందని పాలకులు మనల్ని నమ్మించారు. మనం మోసపోతూనే ఉన్నం.'' అంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వం, పోలీసుల వైఫల్యంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు..