భర్తే విలన్.. ఖమ్మం జిల్లాలో వీడిన తల్లి, ఇద్దరు కుమార్తెల మర్డర్ మిస్టరీ..

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-14 13:05:29.0  )
భర్తే విలన్..  ఖమ్మం జిల్లాలో వీడిన తల్లి, ఇద్దరు కుమార్తెల మర్డర్ మిస్టరీ..
X

దిశ ఖమ్మం సిటీ : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండా హర్యతండా గ్రామాలలో మే 28 సాయింత్రం రోడ్ ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఈ విషయంపై ఖమ్మం నగర ఏసిపి రమణమూర్తి రఘునాధపాలెం పోలీస్ స్టేషన్లో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోడ ప్రవీణ్ అనే డాక్టర్ హైదరాబాద్ నుండి వాళ్ళ గ్రామానికి వెళుతుండగా కారు ప్రమాదంలో కుటుంబసభ్యులు బార్య బోడ కుమారి, కూతుళ్ళు బోడ కృషిక, బోడ కృతికలు మరణించినట్లు సృష్టించడం జరిగిందన్నారు.

ఆ ప్రమాదంలో భర్త ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలు అయి బయటపడడంతో ప్రమాదంగా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అయితే మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించడంతో అనుమానస్పద హత్యగా దర్యాప్తు చేసిన పోలీసులు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు బొడ ప్రవీణ్ ఫిజియోథెరపిస్ట్‌గా హైదారాబాద్‌లో ప్రభుత్వ డాక్టర్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.

ఆ సమయంలో కేరళకు చెందిన సోనీ ఫ్రాన్సిస్ అనే మరో నర్స్‌తో అక్రమ సంబందం కొనసాగిస్తునట్లు ప్రవీణ్ తెలిపారని ఎసీపీ పేర్కొన్నారు. ఇంట్లో గొడవలు జరగడంతో సోనీ, ప్రవీణ్ పక్కా ప్రణాళికతో భార్య పిల్లల అడ్డు తొలగిస్తే ప్రశాంతంగా వుండొచ్చు అని మే 28 తేదీ హైదారాబాద్ నుండి ఇంటికి బయలుదేరి సాయంత్రం సమయంలో తనతో తెచ్చుకున్న డ్రగ్ కాల్షియం ఇంజెక్షన్‌లో కలిపి ఇవ్వడంతో మరణించింది అని దృవీకరించుకొని ఇద్దరు పిల్లలను నోరు మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపడం జరిగిందని నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు.

మంచుకొండ గ్రామం దాటిన తరువాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి కారు లెఫ్ట్ సైడ్ పొదల్లోకి వెళ్లి చెట్టుకు గుద్ధి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని ఒప్పుకున్నాడని పోలీసులు అన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించి నిందితుడు ప్రవీణ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసు విచారణ చేసిన పోలీసులు అధికారులు సీఐ శ్రీహరి, ఎస్సై సురేష్ ను పోలీస్ కమిషనర్ అభినందించినట్లు ఎసీపీ పేర్కొన్నారు.

Advertisement

Next Story