కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. ఆ ప్రచారంలో నిజం లేదన్న రఘునందన్ రావు

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-30 14:26:32.0  )
కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం.. ఆ ప్రచారంలో నిజం లేదన్న రఘునందన్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడికి తాను కారణమని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. దాడి దురదృష్టకరమన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని తెలిసిందన్నారు. ఫేస్ బుక్ పేజీలో కాంగ్రెస్ నేతలతో ఉన్న ఫోటోలు ఉన్నాయన్నారు. నిందితుడు ఏ పార్టీ వ్యక్తి అనేది సీపీ క్లారిటీగా చెబితే బాగుండేదన్నారు. ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దళిత బంధు రాలేదనే నిందితుడు దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. పోలీసులు వెంటనే విచారణ జరిపితే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మొద్దు అన తెలిపారు.

Advertisement

Next Story