Mukthi Divas: సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ముక్తి దివస్’ను ఘనంగా నిర్వహిస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Shiva |
Mukthi Divas: సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ముక్తి దివస్’ను ఘనంగా నిర్వహిస్తాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 17న రాష్ట్ర వ్యాప్తంగా ‘తెలంగాణ ముక్తి దివస్’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాయుధ పోరాటంతో రజాకార్ల నుంచి తెలంగాణకు విమోచనం కలిగిన రోజును ‘ముక్తి దివస్’గా జరుపుకోవాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. రాష్ట్రంలో మెజరిటీ ప్రజలకు బీజేపీయే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చైనాలోని కమ్యూనిస్టు పార్టీని మించి‌న అతిపెద్ద పార్టీ బీజేపీ అని కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదులో ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అన్నారు.

Advertisement

Next Story