MRPS: ఎన్నికల వేళ ఎమ్మార్పీ ఎస్ భారీ ప్లాన్.. హైదరాబాద్ నుంచే షురూ..!

by srinivas |   ( Updated:2023-09-25 13:25:50.0  )
MRPS: ఎన్నికల వేళ ఎమ్మార్పీ ఎస్ భారీ ప్లాన్.. హైదరాబాద్ నుంచే షురూ..!
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్సీ వర్గీకరణకు ఎమ్మార్పీఎస్ మరోసారి పట్టుబిగిస్తోంది. ఇప్పటి వరకూ ఎన్నో దఫాలుగా ఉద్యమించినా వర్గీ కరణలో ఎలాంటి కదిలిక లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే మరోసారి పోరుకు సిద్ధమంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. మదిగల విశ్వరూపం పేరుతో పాదయాత్రకు రెడీ అవుతోంది. ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందేనని అక్టోబర్ 4 నుంచి కార్యచరణను తయారు చేసింది. ఈ విషయాన్ని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో స్పష్టం చేశారు.

ఎస్సీవర్గీకరణ చేయకపోవడానికి ప్రధాన దోషి బీజేపీనేనని మందకృష్ణ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారని.. కాని పార్లమెంట్ సమావేశాల్లో ఎందుకు బిల్లు పెట్టలేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణకు తిరుపతిలో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసి మరీ ప్రధాని మోదీపై ఆయన విమర్శలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు గతంలో నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి కూడా మద్దతు తెలిపారని మందకృష్ణమాదిగ గుర్తు చేశారు. 50 ఏళ్ల క్రితమే దళితుల మధ్య అసమానతలు ఉన్నాయని గతంలో అన్ని కమిషన్లు కూడా రిపోర్టు ఇచ్చాయని తెలిపారు. దళితుల్లో విద్య, ఉద్యోగ అవకాశాల్లో మదిగలు చివరి స్థానంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి సైతం తీసుకెళ్లామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ న్యాయం జరగలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఈ ఎన్నికలకు ముందే హైదరాబాద్‌లో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.

Next Story

Most Viewed