Cotton: పత్తి రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే.. లాభాలే లాభాలు..!

by Prasanna |
Cotton: పత్తి రైతులు ఈ జాగ్రత్తలు పాటిస్తే.. లాభాలే లాభాలు..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో పత్తిని ఎక్కువగా సాగు చేస్తారు. ఇక 2024 లో చూసుకుంటే .. తెల్ల బంగారంలా భావిస్తూ .. ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపారు. ఒక్కొక్కరు ఒకటి నుంచి పది ఎకరాలు వేశారు. పత్తి చేతికొచ్చాక వీటిని పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

కొన్ని సార్లు వాతావరణం అనుకూలించక.. అతివృష్టి, అనావృష్టితో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో, చాలామంది రైతులు పత్తి పంట వేయడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే, పత్తిని తీసే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మంచి ధర తగ్గే అవకాశం ఉంది.

పత్తి పంట రసం పీల్చే పచ్చదోమ ఒకసారి పంటకు సోకితే పత్తి మొక్కలు పాడవుతాయి. అలాగే, వాటి నియంత్రణకు పూత పద్ధతిలో మోనోక్రోటోఫాస్‌ను నీటిలో కలిపి మొక్క యొక్క కాండంపై .. రెండు అంగుళాల పొడవునా రాయాలి. ఇది చేతితో ముట్టకుండా .. బ్రష్‌ను ఉపయోగించి చేయాలి.

రైతులు పత్తి పంటను సాగు చేసే సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో .. తీసే సమయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి.పత్తి బాగా విచ్చుకున్న కాయ నుంచి మాత్రమే పత్తిని తీయాలి. కొద్దిగా విచ్చినా కూడా కాయ నుంచి పత్తి తీయకూడదు. పత్తి తీసే సమయంలో ఆకులు చేతికి అంటకుండా చూసుకోవాలి. అలాగే, తీసిన పత్తిని గాలి తగిలేలా నిల్వ చేయాలి. వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పత్తిని తీయకూడదు. ఎందుకంటే, ఆ సమయంలో పత్తి బరువు రాదు. కాబట్టి నీడలోనే తీయాలి. దీని వలన బరువు పెరుగుతుంది. పత్తి విచ్చిన 5 నుంచి 6 రోజులో తీయాలి. లేదంటే .. గాలికి కింద పడిపోతుంది. దీని వలన రైతులు తీవ్ర నష్టపోతారు.

Next Story