- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తహసీల్దార్ కార్యాలయంలో వ్యక్తి హల్చల్

దిశ,మల్హర్ : మండల కేంద్రమైన తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయంలో వల్లెంకుంట గ్రామానికి చెందిన నారా శంకర్ అనే వ్యక్తి గురువారం పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేశాడు. పురాతన కాలంలోని తాతల నుండి ఉన్న భూమి రికార్డులను స్థానిక వీఆర్ఏలు కీర్తన, స్వర్ణలత అక్రమాలకు పాల్పడి తారుమారు చేయడం వల్ల వారసత్వంగా వస్తున్న భూమి రికార్డులో లేకుండా పోయి తనకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ బాటిల్ తో హంగామా చేశాడు. వీఆర్ఏలు, ఆర్ ఐ కుమ్మక్కై తనకు భూమి లేకుండా చేశారని ఆరోపించారు.
అనంతరం బాటిల్ లో ఉన్న పెట్రోల్ ను టేబుల్ పై వెద చల్లాడు. తగలబెట్టేందుకు వెంట తెచ్చుకున్న లైటర్ ను వెలిగించే ప్రయత్నం చేయగా అది వెలగకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా బాధితుడు శంకర్ ఎన్నోసార్లు తహసీల్దార్తో తన గోడును వెళ్లగక్కగా తమకు భూమి చూపితే ఆర్ఐతో సర్వే చేయించి పట్టా పుస్తకం ఇప్పిస్తామని, లేదంటే తాము ఏమీ చేయలేమని అధికారులు చెప్పినట్టు తెలిసింది. ఈ విషయంపై ఆర్ఐ రాజశేఖర్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై కొయ్యూరు ఎస్సై వడ్లకొండ నరేష్‌ను వివరణ కోరగా ఆర్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.