- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీసీసీ కార్యవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు? తన మార్క్ కోసం మహేశ్ గౌడ్ ప్రయత్నం
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ లో కొత్త కార్యవర్గానికి రూప కల్పన జరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కసరత్తు మొదలైంది. అయితే పీసీసీ కార్యకవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించనున్నారు. దీని వల్ల ఆయా పోస్టుల ప్రయారిటీ పెరుగుతుందని పార్టీ భావన. ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలకు పార్టీలో స్పోక్స్ పర్సన్లుగా అవకాశం కల్పించాలని పీసీసీ చీఫ్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కార్యవర్గానికి ప్రధాన్యత పెరగడమే కాకుండా, పబ్లిక్ లో వాయిస్ కూడా స్పీడ్ గా వెళ్తుందనేది పార్టీ ఆలోచన. దీంతో పాటు పార్టీ అమలు చేయాల్సిన కార్యక్రమాలకు ఆర్థికపరంగానూ అండగా ఉంటారని భావిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీఎంతో చర్చించినట్లు సమాచారం. ఏఐసీసీ హైకమాండ్ కు కూడా ప్రపోజల్ పంపించారు. త్వరలోనే ఏఐసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్గా మహేశ్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి ప్రోగ్రాంను అమలు చేస్తున్నారు. దీంతో కార్యకర్తల సమస్యలు పరిష్కారం అవుతున్నాయనేది పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
గాంధీభవన్ నుంచి జిల్లాల వరకు..
స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటిలన్నీ ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటు పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పదవులనూ నింపనున్నారు. వివిధ కమిటీలలో దాదాపు రెండు వందల మంది నేతలకు పార్టీ పదవులు లభించనున్నాయి. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్స్ మెంబర్లు, జిల్లా అధ్యక్షులకూ త్వరలోనే అప్లికేషన్ల స్వీకరణ మొదలు కానునున్నది. వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తూ ఈ కమిటీలన్నీ ఏర్పడనున్నాయి
హైదరాబాద్ పై సీరియస్...
పదవుల ఎంపికలో పార్టీ, ప్రభుత్వం పెద్దల నుంచి సహజంగానే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. తమ అనుచరులకు పదవులు ఇప్పించే విషయంలో పీసీసీపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. స్టేట్ నుంచి జిల్లా పోస్టుల వరకు ఇదే పరిస్థితి నెలకొంటుంది. అయితే ఈ సారి పనిచేసే నేతలకే పదవులు ఇవ్వాలని పీసీసీ చీఫ్ టార్గెట్ పెట్టుకున్నారు. హైకమాండ్ కూడా ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుల ఎంపికలో సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలోని అధ్యక్షుల అంశంలో దృష్టి పెట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సమర్థవంతమైన వ్యక్తులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. వీటిలో ఖైరతాబాద్ మినహా ప్రస్తుత డీసీసీల పనితీరు కొంత వరకు మెరుగ్గా ఉన్నప్పటికీ, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. ఇక ఖైరతాబాద్ విషయానికి వస్తే ప్రస్తుత డీసీసీ సీఎంకు అతి సన్నిహితమైన వ్యక్తి. తాను ఏం చెప్పినా, చెల్లుతుందనే తరహాలో ముందుకు వెళ్తున్నారని స్వయంగా గాంధీభవన్ నేతలే చెబుతున్నారు. సీఎం, ఏఐసీసీ వ్యవహరాల ఇన్ చార్జీల ప్రోగ్రాంలలో హడావిడి చేసి, ఆ తర్వాత కనిపించరని ఆరోపిస్తున్నారు. కార్యకర్తలకే అందుబాటులో లేని వ్యక్తులను ఎంపిక చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు నేతలు చురకలు అంటిస్తున్నారు. వీటన్నింటిని దృష్టి పెట్టుకొని పదవుల కేటాయింపు విషయంలో కొత్త పీసీసీ చీఫ్ సీరియస్ గా స్టడీ చేస్తున్నారు.