ఈ నెలాఖరులో శాసనసభ రద్దు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: MP

by GSrikanth |   ( Updated:2023-02-05 12:51:43.0  )
ఈ నెలాఖరులో శాసనసభ రద్దు.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన: MP
X

దిశ, వెబ్‌డెస్క్: ముందస్తు ఎన్నికలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరున శాసనసభ రద్దు కాబోతోందని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పాలనకు రాష్ట్ర ప్రజలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో తాను 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నానని జోస్యం చెప్పారు. ఒకవేళ 50 వేల మెజార్టీ రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. కోదాడ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019 ఎన్నికల్లోనూ నల్లగొండ పార్లమెంట్ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Next Story

Most Viewed