వలస నేతలకే ఎంపీ టికెట్లు? సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహం ఇదేనా?

by Ramesh N |
వలస నేతలకే ఎంపీ టికెట్లు? సత్తా చాటేందుకు బీజేపీ వ్యూహం ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల బీజేపీ 9 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో అధికంగా వేరే పార్టీ నుంచి వచ్చిన వలస నేతలకే ఎంపీ టికెట్లు కేటాయించారు. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అర్వింద్‌లకు ఇచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి పీ.భరత్, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్‌కు అవకాశం ఇచ్చారు.

పార్టీలో చేరని మాధవీలతకు కూడా హైదరాబాద్ టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో పార్టీ మారిన నేతలకు వారు కోరుకున్న టికెట్ కన్ఫామ్ అంటూ పొలిటికల్ సర్కిల్ జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేతలు, క్యాడర్ కొంత అసంతృప్తితో ఉన్నారు. కాగా, ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ విజయం సాధించేందుకు బీజేపీ ఇదే వ్యూహం అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed