MP Ranjith Reddy: మీ ఇంట్లో 24 గంటల విద్యుత్ ఉండాలి కానీ, రైతులకు వద్దా..?

by Satheesh |   ( Updated:2023-07-11 15:48:58.0  )
MP Ranjith Reddy: మీ ఇంట్లో 24 గంటల విద్యుత్ ఉండాలి కానీ, రైతులకు వద్దా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు ప్రథమ శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ నేతల ఇంట్లో 24 గంటల విద్యుత్ ఉండాలి గానీ, రైతులకు వద్దా..? అని ప్రశ్నించారు. వ్యవసాయరంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ను వ్యతిరేకిస్తున్నా కాంగ్రెస్ పార్టీ రైతులకు ప్రథమ శత్రువని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, గతంలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, రైతులు ఆందోళన చేపడితే కేసులు పెట్టారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి రైతులే తగిన రీతిలో బుద్ది చెబుతారని హెచ్చరించారు.

Advertisement

Next Story