- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీసీలు అంటే బిచ్చగాళ్లు కాదు.. CM కేసీఆర్‌కు R కృష్ణయ్య వార్నింగ్
దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలు అంటే బిచ్చగాళ్లు కాదని వాటాదారులమని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. దళిత బంధు తరహాలో బీసీ బంధు పథకం కూడా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లో మాట్లాడిన ఆయన బీసీ విద్యార్థులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని.. వారికి రావాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తాము కట్టే పన్నుల ద్వారా మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతున్నారని ధ్వజమెత్తారు. మేము కట్టే పన్నులు మాకు ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి యేటా 45 వేల కోట్ల బడ్జెట్ వస్తోందని.. ఇందంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజల సొమ్మేనన్నారు. ఇందులో నుంచి 150 కోట్లు ఇస్తే తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటారు కదా అని ప్రశ్నించారు. బీసీల పట్ల ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read..
వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై TPCC చీఫ్ రేవంత్ రెడ్డి క్లారిటీ