కేసీఆర్‌ను ఓడించడం ఎవరితరం కాదు.. మూడోసారి సీఎం కావడం పక్కా: MP నామా

by Satheesh |   ( Updated:2023-05-07 11:01:20.0  )
కేసీఆర్‌ను ఓడించడం ఎవరితరం కాదు.. మూడోసారి సీఎం కావడం పక్కా: MP నామా
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌ను ఓడించడం ఎవరితరం కాదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించే సత్తా తెలంగాణలో ఎవరికీ లేదని.. ఎవరెన్ని కలలు గన్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని దీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు సాధించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా, నిరుద్యోగ, పేదల వ్యతిరేక కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని అన్నారు. కేసీఆర్ మూడవసారి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందన్న విషయం తనకు తెలియదని.. పక్క గ్రామంలో వేరే కార్యక్రమానికి వస్తే ఈ విషయం తెలిసిందన్నారు. తనను ఎవరు పిలవకున్న ఆత్మీయ సమ్మేళనానికి వచ్చానని నామా తెలిపారు. ఇక ఈ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి పువ్వాడ అజయ్, ఇతర బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

Advertisement

Next Story