- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రజలు పిచ్చోళ్ళు కాదు.. వాళ్ల చెవుల్లో పువ్వులు పెట్టొద్దు: కేటీఆర్‌కు లక్ష్మణ్ కౌంటర్
దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ ప్రవళిక చావుతో కూడా రాజకీయాలు చేస్తున్నారని, అనవసరంగా ఆమెపై నిందలు మోపుతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ తన సుదీర్ఘ ఇంటర్వ్యూలో చాలా కామెంట్స్ చేశారని, ఎలక్షన్స్ నేపథ్యంలో పోలీసులు.. వారి విధులు వారు చేపడుతున్నారని, ఎన్నికల సంఘం పరిధిలో ఉండి పనిచేస్తున్నారని అనడంపై మండిపడ్డారు.
ఇది నమ్మడానికి ప్రజలు పిచ్చోళ్ళు కాదని, వారి చెవుల్లో పువ్వులు పెట్టొద్దని లక్ష్మణ్ చురకలంటించారు. రాష్ట్ర శాంతిభద్రతలు చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ఎన్నికల సంఘానిది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్.. 30 లక్షల నిరుద్యోగుల జీవితాలను బుగ్గి చేసిందని ఫైరయ్యారు. ప్రవళిక ఆత్మహత్యకు పూర్తి బాధ్యత బీఆర్ఎస్ వహించాలని డిమాండ్ చేశారు. ప్రవళిక గ్రూప్ 2కు సిద్ధమవుతోందని, గ్రూప్ 4 పరీక్ష కూడా రాసిందన్నారు. ఉద్యోగం సాధించి త్వరలోనే ఇంటికి వస్తానని ప్రవళిక తన తల్లితో చెప్పిందని, ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే వెల్లడించినా పట్టించుకోలేదన్నారు.
ప్రవళిక మృతిపై తప్పుడు ఆరోపణలు ఇప్పటికైనా మానుకోవాలని ఆయన పేర్కొన్నారు. చావుతో కూడా బీఆర్ఎస్ రాజకీయాలు చేయడంపై ఆయన మండిపడ్డారు. రాజకీయం కోసం ఒక కుటుంబాన్ని అభాసుపాలు చేస్తారా అని ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ఆ యువతిపై నిందలు మోపుతారా అని విరుచుకుపడ్డారు. మానవత్వం ఉన్న ఎవరూ ఇలా చేయరని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి.. అపవాదు వేసి వారి పరువును దిగజార్చేలా ప్రవర్తిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే.. పోలీసులు మీడియాతో ఎలా మాట్లాడుతారని, ఎవరి అండ చూసుకుని డీసీపీ అలా వ్యాఖ్యానించారని ధ్వజమెత్తారు. తప్పుడు సమాచారం ఎందుకు చెబుతున్నారని ఫైరయ్యారు. ఇప్పటికే యువత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా రగిలిపోతోందని, బీఆర్ఎస్‌ను ఇంటికి పంపించడం ఖాయమని లక్ష్మణ్ పేర్కొన్నారు.