- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు థాక్రేతో భేటీ.. MP కోమటిరెడ్డిపై చర్యలు తప్పవా?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యల దుమారం రేగింది. హంగ్ వస్తుందంటూ వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై సొంత పార్టీతో పాటు ప్రత్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా వెంకట్ రెడ్డి తీరుపై రేవంత్ రెడ్డి వర్గం భగ్గుమంటోంది. కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడుతున్న తరుణంలో రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన వెంకట్ రెడ్డి ఈ తరహా కామెంట్స్ చేయడం ఏంటనే టాక్ వినిపిస్తోంది. అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని కలిసిన కాసేపటికే వెంకట్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై అధిష్టానం అలర్ట్ అయింది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్ రావు థాక్రే ఆరా తీశారు. ఆయన కామెంట్స్ వీడియోను పరిశీలించినట్లు తెలుస్తోంది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం తెలంగాణకు థాక్రే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం కోమటిరెడ్డితో థాక్రే భేటీ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భేటీలో తన వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి ఎలాంటి వివరణ ఇచ్చుకోబోతున్నారనే ఆసక్తిగా మారింది. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడిన నాటినుంచి వెంకట్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ లో చర్చ జరగుతూనే ఉంది. ఈ క్రమంలో మునుగోడు బై ఎలక్షన్ రావడం ఆ సమయంలో పార్టీ కార్యక్రమాలకు వెంకట్ రెడ్డి దూరంగా ఉండటం హాట్ టాపిక్ అయింది. అంతలోనే పార్టీని కాదని రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలంటూ వెంకట్ రెడ్డికి చెందినది అంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వెంకట్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటీ?:
మునుగోడు ఎన్నికల సమయంలో వెలుగు చూసిన ఆడియో క్లిప్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దానిపై ఆయన వివరణ ఇచ్చినట్లు ఎక్కడా తెలియరాలేదు. అనంతరం పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మారిపోవడం, కొత్త ఇన్‌చార్జిగా మాణిక్ రావు థాక్రేను నియమించడంతో తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే గతంలో రానని చెప్పిన గాంధీ భవన్‌కు వెంకట్ రెడ్డి రావడం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ కావడం సంచల పరిణామంగా మారింది.
అయితే ఆడియో క్లిప్ విషయంలో తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు వట్టివే అని అవేవి పట్టించుకోకుండా తన పని చేసుకుపోవాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించినట్లు అప్పట్లో వెంకట్ రెడ్డి చెప్పారు. తాజాగా పార్టీ పొత్తులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ సారి అధిష్టానం వైఖరి ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కోమటిరెడ్డి తీరుపై రేవంత్ రెడ్డి వర్గంతో పాటు వీహెచ్ లాంటి సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ సారైనా వెంకట్ రెడ్డి నుండి పార్టీ పెద్దలు వివరణ తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. వివరణ తీసుకున్న తర్వాత ఒక వేళ చర్యలకు ఆదేశిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్కంఠగా మారింది.
Read more: