పాచ్యాత్య సంస్కృతి వద్దు: ఎంపీ ఈటల కీలక పిలుపు

by srinivas |
పాచ్యాత్య సంస్కృతి వద్దు: ఎంపీ ఈటల కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్త్రీని పూజించే దేశం భారతదేశమని, పాచ్యాత్య సంస్కృతి, డిస్కో టెక్, పబ్బు కల్చర్ మనది కాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. పికెట్ కేంద్రీయ విద్యాలయలో జరిగిన రాష్ట్రీయ ఏక్తా పర్వ్ కార్యక్రమానికి ఈటల హాజరై మాట్లాడారు. దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సంస్కృతి, సాంప్రదాయం, ఒక్కో భాష ఉందని, స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనా దేశమంతా ఐక్యతతో ముందుకుపోతోందన్నారు. సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందిస్తున్న కేంద్రాలు కేంద్రీయ విద్యాలయాలని ఈటల కొనియాడారు. ఒకప్పుడు భారతదేశమంటే చిన్నచూపు ఉండేదని, మోడీ ప్రధాని అయ్యాక భారతీయులు గల్లా ఎగురవేసుకునే స్థితికి చేరుకున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికా, రష్యాలను దాటి భారతదేశం ఎదగబోతోందన్నారు. ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. రెండ్రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తినకు పయనమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed