- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Eatala Rajendar: ఇల్లు కూలగోడితే బీ కేర్ఫుల్.. నేను ఇక్కడే ఉంటా: ఈటల మాస్ వార్నింగ్!

దిశ, డైనమిక్ బ్యూరో: సోమవారం వచ్చి ఇల్లు కూలగొడతా అంటే మీ సంగతేందో చెప్పటానికి నేను ఇక్కడే ఉంటా.. అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ MP Eatala Rajender మాస్ వార్నింగ్ ఇచ్చారు. కాప్రా పరిధిలోని అరుంధతి నగర్ కాలనీలో ఇళ్లకు కూలగొట్టి, మార్కింగ్ పెట్టారని బాధితులు శనివారం ఉదయం షామీర్‌పేట్ నివాసానికి వచ్చారు. వెంటనే బాధితులతో కాలనీకి వెళ్ళి ఈటల పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకుని, కన్నవారిని వదిలిపెట్టి బతుకు తెరువు కోసం వచ్చి నివసించే ప్రాంతం జవహార్‌నగర్, బాలాజీనగర్ అని పేర్కొన్నారు. నిత్యం కూలి చేసి బతుకుతూ రూ. ఐదు, పదివేలు జమచేసుకుని జీవో నెంబర్ 58, 59 కింద భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారని తెలిపారు. అయితే, రెవెన్యూ అధికారులకు హద్దే లేకుండా పోయిందని, హుడా అధికారులు వచ్చి తమ బౌండరీలో వచ్చాయని వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రాంతం కీసర, కాప్రా మండలాల కిందకు వస్తుందని, పాత ఇల్లు కూల్చి కొత్తవి కట్టుకుందామన్న, ఖాళీ జాగాలో ఇల్లు కట్టుకోవాలన్న రూ. 50 వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఇక్కడున్న బ్రోకర్లకు ఇస్తే తప్ప కట్టుకోనివ్వడం లేదని ఆరోపించారు. ఒకవేళ ఆ డబ్బులు ఇవ్వకపోతే వారి ఇల్లు కూలగొట్టే పద్ధతి ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. హుడా వాళ్ళు వచ్చి ఈ ప్రాంతం మాదే అని మార్కింగ్ చేసి వెళ్తున్నారని, రెవెన్యూ వారు సోమవారం వచ్చి ఒక 100 ఇళ్లయిన కూలగోడతమని బెదిరిస్తున్నారంట.. అని ఆరోపించారు. వాళ్ళు మూర్ఖులు, దుర్మార్గులు, పేదల రక్తం తాగుతున్నారని, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు ఉందని మండిపడ్డారు.
ఇల్లు కూలగోడితే బీ కేర్ఫుల్..
కలెక్టర్‌తో వంద సార్లు మాట్లాడాను.. ఈ బాలాజీ నగర్ నేను పుట్టక ముందు నుంచి ఉంది.. అంటూ పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించమని చెప్పినట్లు వెల్లడించారు. అయిన వారు నిమ్మకు నీరెత్తనట్టుగా, ప్రజలు బతుకులు పట్టనట్టుగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయం గురించి రెవెన్యూ మంత్రితో కూడా చర్చించే ప్రయత్నం చేస్తానని భాదితులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం పిచ్చి పని చేస్తే, పేదల జోలికి వచ్చి ఇల్లు కూలగోడితే బీ కేర్ఫుల్ అని హెచ్చరించారు.