- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి HERO అనుకుంటున్నాడు.. హైడ్రా కూల్చివేతలపై MP ఈటల సీరియస్
దిశ, వెబ్‌డెస్క్: హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) కూల్చివేతలపై టీ.బీజేపీ కీలక నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద పెద్ద వాళ్ల అక్రమ నిర్మాణాలను పక్కనబెట్టి సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వచ్చాకే పుట్టలేదని.. వందల ఏళ్ల నుంచి ఉందని అన్నారు. నాలుగు రోజులుగా ఆయన్ను ఆయనే హీరో అనుకొని రేవంత్ రెడ్డి హైడ్రామా చేస్తున్నారని సీరియస్ అయ్యారు.
గతంలో అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు చేసి కేసీఆర్ ఫొటోలకు ఫోపజులిచ్చారు.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్దల అక్రమ నిర్మాణాలు కూలిస్తే మంచిదే కానీ పేదలపై ప్రతాపం చూపించొద్దని అన్నారు. 40 ఏళ్ల క్రితమే ఎఫ్‌టీఎల్‌లో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇళ్లు కట్టుకున్నారు. మరి అనుమతులు ఇచ్చిన కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషన్లు, సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈటల ప్రశ్నించారు.