- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
DK Aruna : కులగణన సర్వేపై ఎంపీ డీకే అరుణ ఫైర్
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన(Caste Census) సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి డీకే అరుణ(MP DK Aruna) తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికి సర్వే ప్రశ్నావళి మాత్రం కుల గణనకు విరుద్ధంగా ఉందని డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. కుల గణన సర్వేకు ప్రజల ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అన్న వివరాలు సేకరణ ఎందుకని డీకే అరుణ నిలదీశారు. వాస్తవంగా ఈ సర్వే దేనికోసమో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన సర్వే తీరు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల హామీలను ఎగవేసేందుకు, ప్రభుత్వ పథకాల్లో కోత విధించేందుకే ఈ సర్వే అన్న అనుమానాలు ప్రజల్లో వినిపిస్తుందన్నారు. ముఖ్యంగా బీసీల ప్రయోజనాల పేరుతో చేపట్టిన కుల గణన సర్వే బీసీ వర్గాలను మోసం చేయడానికేనంటూ ఆమె దుయ్యబట్టారు. ప్రజలు ఇచ్చిన వివరాలు మాత్రమే సర్వేలో స్వీకరించాలని, బలవంతంగా వివరాలు సేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రభుత్వం సర్వే పేరుతో ప్రజల స్వేచ్ఛను హరిస్తుందని, 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు కుల గణన చేయలేదని డీకే అరుణ ప్రశ్నించారు. . కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే... రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ మూసీ ప్రక్షాళనను వ్యతిరేకించడం లేదని, ఆ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీకి జరుగుతున్న ప్రయత్నాలను మాత్రమే వ్యతిరేకిస్తుందని, పేదలను రోడ్డు పాలు చేయడాన్ని ప్రశ్నిస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు ఆర్ధిక భారం తగ్గించేందుకు డ్రైనేజీ నీళ్ళు మూసీ నదిలోకి వెళ్లకుండా మూసీ చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసమా అని అరుణ ప్రశ్నించారు.